విగ్రహారాధన గురించి హెచ్చరిక
14 అవిశ్వాసులతో సహవాసం చేయకండి. ఎందుకంటే నీతి అవినీతి ఎలా కలిసి ఉంటాయి? చీకటి వెలుతురు ఎలా కలిసి ఉంటాయి? 15 క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఏమిటి? 16 దేవాలయాలకు విగ్రహాలకు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి? మనం జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి దేవుడు ఇలా చెప్పారు:
"నేను వారితో నివసిస్తాను
వారి మధ్య నడుస్తాను,
నేను వారి దేవునిగా ఉంటాను,
వారు నా ప్రజలుగా ఉంటారు."6:16 లేవీ 26:12; యిర్మీయా 32:38; యెహె 37:27
17 కాబట్టి,
"వారి మధ్య నుండి బయటకు వచ్చి
ప్రత్యేకంగా ఉండండి,
అని ప్రభువు చెప్తున్నాడు.
అపవిత్రమైన దానిని తాకకండి,
అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను.6:17 యెషయా 52:11; యెహె 20:34,41