9 వారు దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, "నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్లక ముందు, నేను నీకోసం ఏం చెయ్యాలో చెప్పు" అన్నాడు.
అందుకు ఎలీషా అన్నాడు, "నీ మీద ఉన్న ఆత్మ నా మీద రెండంతలుగా నేను పొందుకోనివ్వు."
10 అందుకు ఏలీయా, "నీవు అడిగింది కష్టమైనది, అయితే నన్ను తీసుకువెళ్లే సమయంలో నీవు నన్ను చూస్తే నీవు దానిని పొందుకుంటావు, చూడకపోతే నీవు పొందుకోవు" అని చెప్పాడు.