Pular para o conteúdo
Publicidade

ప్రసంగి 10

1 పరిమళతైలంలో పడిన చచ్చిన ఈగలు దానికి చెడు వాసన తెచ్చినట్లు,

కొంచెం మూర్ఖత్వం జ్ఞానాన్ని ఘనతను పాడుచేస్తుంది.

2 జ్ఞాని హృదయం కుడి చేతిలో ఉంటుంది,

కాని మూర్ఖుడి హృదయం ఎడమ చేతిలో ఉంటుంది.

3 తెలివిలేనివారు దారిలో సరిగా నడవలేక

వారు ఎంత తెలివితక్కువ వారు అనేది

అందరికి చూపిస్తారు.

4 వారు ఎంత తెలివితక్కువ వారు అనేది,

మీ ఉద్యోగాన్ని వదిలేయవద్దు;

ప్రశాంతత గొప్ప నేరాలు జరుగకుండ ఆపుతుంది.

5 నేను సూర్యుని క్రింద ఒక చెడ్డ విషయాన్ని చూశాను,

ఒక పాలకుడు పొరపాటున చేసిన అన్యాయం:

6 అదేమిటంటే మూర్ఖులను ఉన్నత పదవులలో,

సమర్థులను దిగువ స్థాయిలో ఉంచడమే.

7 నేను బానిసలు గుర్రాలపై,

యువరాజులు బానిసల్లా కాలినడకన వెళ్లడం చూశాను.

8 గొయ్యి త్రవ్వినవారే అందులో పడతారు;

గోడను పడగొట్టిన వారే పాము కాటుకు గురవుతారు.

9 రాళ్లు దొర్లించేవారు దానివల్ల గాయపడతారు;

మొద్దులను చీల్చేవారు వాటి వల్ల ప్రమాదానికి గురి అవుతారు.

10 ఒకవేళ గొడ్డలి మొద్దుబారి

దాని అంచుకు పదును పెట్టకపోతే,

ఎక్కువ బలం ఉపయోగించాల్సి ఉంటుంది,

అయితే జ్ఞానం విజయాన్ని తెస్తుంది.

11 ఒకవేళ లొంగదీయక ముందే పాము కాటేస్తే,

పాములు ఆడించేవానికి లాభం ఉండదు.

12 జ్ఞానుల నోటి నుండి వచ్చే మాటలు దయగలవి,

కాని మూర్ఖుని పెదవులు వానినే మ్రింగివేస్తాయి.

13 అవివేకంతో మొదలైన వారి మాటలు;

దుర్మార్గపు వెర్రితనంతో ముగుస్తాయి;

14 అయినా మూర్ఖులు వాగుతూనే ఉంటారు.

ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు

వారు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు?

15 మూర్ఖులకు పట్టణానికి వెళ్లడానికి దారి తెలియదు;

కాబట్టి తమ శ్రమతో వారు అలసిపోతారు.

16 దాసుడు10:16 లేదా రాజు బాలుడు రాజుగా ఉన్న దేశానికి

ఉదయాన్నే విందు చేసుకొనే యువరాజులు ఉన్న దేశానికి శ్రమ.

17 గొప్ప జన్మ కలిగినవాడు రాజుగా ఉన్న దేశం

మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో

భోజనానికి కూర్చునే అధిపతులు ఉన్న దేశం ధన్యమైనది.

18 ఒకని సోమరితనం వల్ల ఇంటికప్పు కూలిపోతుంది,

ఒకని బద్దకం వల్ల ఇల్లు కారిపోతుంది.

19 నవ్వడం కోసం విందు చేస్తారు,

ద్రాక్షరసం జీవితానికి సంతోషం కలిగిస్తుంది,

డబ్బు ప్రతిదానికీ సమాధానం.

20 మీ ఆలోచనలో కూడా రాజును తిట్టవద్దు,

మీ పడకగదిలో కూడా ధనికులను శపించవద్దు,

ఎందుకంటే ఆకాశపక్షులు,

రెక్కలున్న పక్షులు మీరు చెప్పేవాటిని బయట పెట్టవచ్చు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.