Pular para o conteúdo
Publicidade

ప్రసంగి 2:13-16

OTSA Telugu Contemporary Version

13 చీకటి కంటే వెలుగు మేలు అని,

బుద్ధిహీనత కంటే జ్ఞానం మేలు అని నేను చూశాను.

14 జ్ఞానికి తలలో కళ్లు ఉంటాయి.

మూర్ఖుడు చీకటిలో నడుస్తాడు.

అయినా అందరి విధి ఒకటే

అని నేను గ్రహించాను.

15 నాలో నేను అనుకున్నాను

మూర్ఖుడికి సంభవించేదే నాకూ సంభవిస్తుంది.

నేను ఇంత జ్ఞానం సంపాదించి నాకేం లాభం?

"ఇది కూడా అర్థరహితం" అని

నాలో నేననుకున్నాను.

16 ఎందుకంటే మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడా ఎక్కువకాలం జ్ఞాపకం ఉండరు;

ఇరువురిని మరచిపోయే రోజులు ఇప్పటికే వచ్చాయి.

మూర్ఖుల్లాగే జ్ఞానులు కూడ చస్తారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    13 అప్పుడు చీకటి కంటే వెలుగెంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరం అని నేను తెలుసుకున్నాను.

    14 జ్ఞాని కళ్ళు అతని తలలో ఉన్నాయి. బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడు.

    అయినా అందరి గమ్యం ఒక్కటే అని నేను గ్రహించాను.

    15 కాబట్టి బుద్ధిహీనుడికి జరిగేదే నాకూ జరుగుతుంది, మరి నేను ఇంత జ్ఞానం ఎందుకు సంపాదించాను

    అని నా హృదయంలో అనుకున్నాను. కాబట్టి ఇదీ నిష్ప్రయోజనమే.

    16 బుద్ధిహీనులకు జరిగినట్టే జ్ఞానులను కూడా ఎవరూ జ్ఞాపకం ఉంచుకోరు. రాబోయే రోజుల్లో వారందరినీ మర్చిపోతారు.

    బుద్ధిహీనుడు ఎలా చనిపోతాడో, జ్ఞాని కూడా అలాగే చనిపోతాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.