Pular para o conteúdo
Publicidade

ప్రసంగి 3:1-8,11

ప్రతి దానికి సమయముంది

1 ప్రతిదానికీ ఒక సమయం ఉంది,

ఆకాశాల క్రింద ప్రతీ కార్యకలాపానికి ఒక కాలం ఉంది:

2 పుట్టడానికి సమయం చావడానికి సమయం,

నాటడానికి సమయం, పెరికివేయడానికి సమయం,

3 చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం,

పడగొట్టడానికి, కట్టడానికి.

4 ఏడ్వడానికి, నవ్వడానికి

దుఃఖపడడానికి, నాట్యమాడడానికి,

5 రాళ్లు పారవేయడానికి, కుప్పవేయడానికి,

కౌగిలించుకోడానికి, కౌగిలించడం మానడానికి.

6 వెదకడానికి సమయం, పోగొట్టుకోడానికి సమయం,

దాచిపెట్టడానికి, పారవేయడానికి,

7 చింపివేయడానికి, కుట్టడానికి,

మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి,

8 ప్రేమించడానికి, ద్వేషించడానికి,

యుద్ధం చేయడానికి, సమాధానపడడానికి సమయం ఉంటుంది.

11 ఆయన ప్రతిదాన్ని దాని సమయానికి తగినట్లుగా ఉండేలా చేశారు. ఆయన మానవ హృదయంలో నిత్యమైన జ్ఞానాన్ని ఉంచారు; దేవుడు చేసిన వాటిని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా ఎవరూ గ్రహించలేరు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.