Pular para o conteúdo
Publicidade

ఎస్తేరు 10

మొర్దెకై గొప్పతనం

1 అహష్వేరోషు రాజు తన సామ్రాజ్యమంతట, సముద్ర తీరాల వరకు కప్పం విధించాడు. 2 అతని బలప్రభావాలుగల చర్యలు, రాజు హెచ్చించిన మొర్దెకై యొక్క గొప్పతనం యొక్క పూర్తి వివరాలు, మాదీయులు, పర్షియా రాజుల చరిత్ర గ్రంథాల్లో వ్రాయబడలేదా? 3 రాజైన అహష్వేరోషుకు రెండవ స్థానంలో యూదుడైన మొర్దెకై ఉన్నాడు, అతడు యూదులలో ప్రముఖునిగా, తన తోటి యూదులైన ఎంతోమంది ద్వారా గౌరవం పొందుకున్నాడు, ఎందుకంటే తన ప్రజల క్షేమాన్ని విచారిస్తూ, యూదులందరి యొక్క శ్రేయస్సు కోసం మాట్లాడేవాడు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.