20 అప్పుడు అహరోను సోదరి ప్రవక్త్రియైన మిర్యాము తంబుర తన చేతిలోనికి తీసుకున్నది. అప్పుడు స్త్రీలందరు తంబురలతో నాట్యంతో ఆమెను అనుసరించారు. 21 మిర్యాము వారితో ఇలా పాడింది:
"యెహోవాకు పాడండి,
ఎందుకంటే ఉన్నతంగా హెచ్చింపబడ్డారు.
గుర్రాన్ని దాని రౌతును
ఆయన సముద్రంలో విసిరిపడవేశారు."