3 స్వార్థపూరిత ఆశలతో లేదా వ్యర్థమైన గర్వంతో ఏమి చేయకండి. దానికి బదులు, వినయంతో ఇతరులకు మీకంటే ఎక్కువ విలువను ఇస్తూ, 4 మీ సొంత పనులపై మాత్రమే ఆసక్తి చూపక, మీలో ప్రతి ఒక్కరు ఇతరుల పనులపై కూడా ఆసక్తి చూపించాలి.
5 మీలో ఒకరితో ఒకరికి గల మీ సంబంధాల్లో క్రీస్తు యేసు కలిగి ఉన్న స్వభావాన్నే మీరు కూడా కలిగి ఉండండి:
6 ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై ఉండి,
దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;
7 కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని
తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని
మనుష్యుని పోలికగా పుట్టారు.
8 మనుష్యునిగా కనబడి
మరణానికి విధేయత చూపించడం ద్వారా
అనగా సిలువ మరణం పొందేంతగా
తనను తాను తగ్గించుకున్నారు!