Pular para o conteúdo
Publicidade

ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:3-8

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

3 స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5 క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.

క్రీస్తు ఏడు విధాలుగా విధేయత కనుపరచడం

6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.

దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.

బానిస రూపం తీసుకున్నాడు.

మానవుల పోలికలో కనిపించాడు.

ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,

తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    3 స్వార్థపూరిత ఆశలతో లేదా వ్యర్థమైన గర్వంతో ఏమి చేయకండి. దానికి బదులు, వినయంతో ఇతరులకు మీకంటే ఎక్కువ విలువను ఇస్తూ, 4 మీ సొంత పనులపై మాత్రమే ఆసక్తి చూపక, మీలో ప్రతి ఒక్కరు ఇతరుల పనులపై కూడా ఆసక్తి చూపించాలి.

    5 మీలో ఒకరితో ఒకరికి గల మీ సంబంధాల్లో క్రీస్తు యేసు కలిగి ఉన్న స్వభావాన్నే మీరు కూడా కలిగి ఉండండి:

    6 ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై ఉండి,

    దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;

    7 కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని

    తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని

    మనుష్యుని పోలికగా పుట్టారు.

    8 మనుష్యునిగా కనబడి

    మరణానికి విధేయత చూపించడం ద్వారా

    అనగా సిలువ మరణం పొందేంతగా

    తనను తాను తగ్గించుకున్నారు!

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filipenses
Ver todos os capítulos de Filipenses