11 యెహోవా ఇలా అంటున్నారు,
"విస్తారమైన మీ బలులు నాకెందుకు?
దహనబలులుగా ఇచ్చిన పొట్టేళ్లు,
బాగా క్రొవ్విన జంతువుల క్రొవ్వు నాకు వెగటు కలిగించాయి;
ఎద్దుల, గొర్రెపిల్లల, మేకపోతుల రక్తంలో
నాకు ఆనందం లేదు.
16 "మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి.
మీ చెడు కార్యాలు నాకు కనిపించకుండా వాటిని తొలగించండి;
తప్పు చేయడం మానండి.
17 సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి.
అణచివేయబడుతున్న వారి1:17 లేదా న్యాయం హింసిస్తున్న వారిని సరిచేయండి పక్షాన ఉండండి.
తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి.
విధవరాలి పక్షాన వాదించండి.