Pular para o conteúdo
Publicidade

యెషయా 1:11-17

11 యెహోవా ఇలా అంటున్నారు,

"విస్తారమైన మీ బలులు నాకెందుకు?

దహనబలులుగా ఇచ్చిన పొట్టేళ్లు,

బాగా క్రొవ్విన జంతువుల క్రొవ్వు నాకు వెగటు కలిగించాయి;

ఎద్దుల, గొర్రెపిల్లల, మేకపోతుల రక్తంలో

నాకు ఆనందం లేదు.

12 మీరు నా సన్నిధికి వస్తున్నప్పుడు,

నా ఆవరణాలను త్రొక్కడానికి

మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు?

13 విలువలేని అర్పణలు తీసుకురావడం ఆపండి!

మీ ధూపం నాకు అసహ్యం కలిగిస్తుంది.

అమావాస్యలు, సబ్బాతులు, ప్రత్యేక సమావేశాలు

మీ దుష్ట సమావేశాలు నేను భరించలేను.

14 మీ అమావాస్య ఉత్సవాలు, నియమించబడిన పండుగలు

నా పూర్ణాత్మతో నేను అసహ్యిస్తున్నాను.

అవి నాకు భారంగా ఉన్నాయి;

వాటిని భరించలేక అలిసిపోయాను.

15 ప్రార్థనలో మీరు మీ చేతులు చాచినప్పుడు,

మిమ్మల్ని చూడకుండ కళ్లు కప్పుకుంటాను;

మీరు చాలా ప్రార్థనలు చేసినా

నేను వినను.

"మీ చేతులు రక్తంతో నిండిపోయాయి!

16 "మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి.

మీ చెడు కార్యాలు నాకు కనిపించకుండా వాటిని తొలగించండి;

తప్పు చేయడం మానండి.

17 సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి.

అణచివేయబడుతున్న వారి1:17 లేదా న్యాయం హింసిస్తున్న వారిని సరిచేయండి పక్షాన ఉండండి.

తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి.

విధవరాలి పక్షాన వాదించండి.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.