12 తేజోనక్షత్రమా, వేకువచుక్కా,
నీవెలా ఆకాశం నుండి పడ్డావు?
దేశాలను పడగొట్టిన నీవు
భూమి మీద ఎలా పడవేయబడ్డావు?
13 నీవు నీ హృదయంలో,
"నేను ఆకాశాలను ఎక్కుతాను;
దేవుని నక్షత్రాల కన్నా ఎత్తుగా
నా సింహాసనాన్ని హెచ్చిస్తాను;
ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద,
సాఫోన్14:13 సాఫోన్ కనానీయుల చేత అతి పవిత్ర పర్వతముగా పరిగణించబడింది. పర్వతం యొక్క ఎత్తైన స్థలాల మీద కూర్చుంటాను.
14 మేఘ మండలం మీదికి ఎక్కుతాను.
నన్ను నేను మహోన్నతునిగా చేసుకుంటాను" అనుకున్నావు.
15 కాని నీవు పాతాళంలో చచ్చిన వారి స్థలంలో
లోతైన గోతిలో త్రోయబడ్డావు.