7 అప్పుడు అరీయేలుతో యుద్ధం చేసే అన్ని దేశాల గుంపులు
దాని మీద దాడి చేసి దాని కోటను ముట్టడించేవారు
ఒక కలలా ఉంటారు
రాత్రివేళలో వచ్చే దర్శనంలా ఉంటారు.
8 ఆకలితో ఉన్నవారు తింటున్నట్లు కల కని
కాని ఇంకా ఆకలితోనే మేల్కొన్నట్లు,
దాహంతో ఉన్నవారు త్రాగినట్లు కల కని
ఇంకా అలసిపోయి దాహంతోనే మేల్కొన్నట్లు ఉంటారు.
సీయోను కొండకు వ్యతిరేకంగా యుద్ధం చేసే
అన్ని దేశాల గుంపులకు ఇలా ఉంటుంది.