Pular para o conteúdo
Publicidade

యెషయా 40:27-31

OTSA Telugu Contemporary Version

27 యాకోబూ, "నా త్రోవ యెహోవాకు మరుగై ఉంది;

నా న్యాయాన్ని నా దేవుడు పట్టించుకోలేదు" అని

నీవెందుకు అంటున్నావు?

ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెప్తున్నావు?

28 నీకు తెలియదా?

నీవు వినలేదా?

భూమి అంచులను సృష్టించిన

యెహోవా నిత్యుడైన దేవుడు.

ఆయన సొమ్మసిల్లరు, అలసిపోరు,

ఆయన జ్ఞానాన్ని ఎవరూ గ్రహించలేరు.

29 ఆయన అలిసిపోయిన వారికి బలమిస్తారు

శక్తిలేనివారికి శక్తిని ఇస్తారు.

30 యువత సొమ్మసిల్లి అలసిపోతారు,

యువకులు తడబడి పడిపోతారు.

31 కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు,

నూతన బలాన్ని పొందుతారు.

వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు;

అలసిపోకుండా పరుగెత్తుతారు.

సొమ్మసిల్లకుండా నడుస్తారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    27 యాకోబూ "నా మార్గం యెహోవాకు తెలియదు, నా న్యాయం నా దేవునికి కనబడదు" అని నీవెందుకు అంటున్నావు? ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెబుతున్నావు?

    28 నీకు తెలియలేదా? నీవు వినలేదా?

    భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు.

    ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.

    29 అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే.

    30 యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు.

    31 అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు.

    వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు.

    అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.