Pular para o conteúdo
Publicidade

యెషయా 40:6-8

OTSA Telugu Contemporary Version

6 "మొరపెట్టు" అని ఒక స్వరం అంటుంది,

నేను, "నేనేమని మొరపెట్టాలి?" అన్నాను.

"ప్రజలందరు గడ్డి వంటివారు,

వారి నమ్మకత్వమంతా పొలంలోని పువ్వు వంటిది.

7 గడ్డి వాడిపోతుంది, పువ్వులు రాలిపోతాయి

ఎందుకంటే యెహోవా తన ఊపిరి వాటి మీద ఊదుతారు.

నిజంగా ప్రజలు గడ్డిలా ఉన్నారు.

8 గడ్డి ఎండిపోతుంది, పువ్వులు వాడిపోతాయి,

కాని మన దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉంటుంది."

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 వినండి "ప్రకటించండి" అని ఒక స్వరం పలికింది.

    "నేనేం ప్రకటించాలి?" మరొక స్వరం పలికింది. "శరీరులంతా గడ్డివంటివారు, వారి అందమంతా అడవి పువ్వులాటిది.

    7 యెహోవా తన ఊపిరి ఊదినప్పుడు గడ్డి ఎండిపోతుంది. పువ్వులు వాడిపోతారు. మనుషులు నిజంగా గడ్డిలాంటివారే.

    8 గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. మన దేవుని వాక్యమైతే నిత్యమూ నిలిచి ఉంటుంది."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.