1 కోరెషు పక్షంగా దేశాలను జయించడానికి
రాజులను నిరాయుధులుగా చేయడానికి
అతని ఎదుట ద్వారాలు మూయబడకుండా
తలుపులు తీయడానికి
నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను.
తన అభిషిక్తుడైన ఈ కోరెషుతో యెహోవా చెప్పే మాట ఇదే:
2 నేను నీకు ముందుగా వెళ్లి
పర్వతాలను చదును చేస్తాను;
ఇత్తడి తలుపుల్ని పగలగొట్టి,
ఇనుప గడియలను విరగ్గొడతాను.
3 పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను
నేనేనని నీవు తెలుసుకునేలా
రహస్య స్థలాల్లో ఉంచిన నిధులను
దాచబడిన ధనాన్ని నీకిస్తాను.