14 అయితే సీయోను, "యెహోవా నన్ను విడిచిపెట్టారు.
ప్రభువు నన్ను మరచిపోయారు" అని అన్నది.
15 "తల్లి తన చంటిబిడ్డను మరచిపోతుందా?
తాను కన్న బిడ్డ మీద జాలిపడకుండ ఉంటుందా?
తల్లియైన మరచిపోవచ్చు కాని
నేను నిన్ను మరవను!
16 చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను;
నీ గోడలు నిత్యం నా ఎదుట ఉన్నాయి.
25 అయితే యెహోవా చెప్పే మాట ఇదే:
"అవును, వీరుల నుండి బందీలు విడిపించబడతారు,
క్రూరుల నుండి దోపుడుసొమ్ము తిరిగి వస్తుంది;
నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను.
నీ పిల్లలను నేను రక్షిస్తాను.