Pular para o conteúdo
Publicidade

యెషయా 53:1-5

OTSA Telugu Contemporary Version

1 మా సందేశాన్ని ఎవరు నమ్మారు?

యెహోవా హస్తం ఎవరికి వెల్లడయింది?

2 లేత మొక్కలా ఎండిన భూమిలో మొలిచిన మొక్కలా

అతడు ఆయన ఎదుట పెరిగాడు.

మనల్ని అతనివైపు ఆకర్షించేంత అందం గాని ఘనత గాని అతనికి లేదు,

మనం అతన్ని కోరుకునేంతగా మంచి రూపమేమీ అతనికి లేదు.

3 అతడు మనుష్యులచే తృణీకరించబడి తిరస్కరించబడినవానిగా,

శ్రమలు అనుభవించినవానిగా, బాధను ఎరిగినవానిగా ఉన్నాడు.

ప్రజలు అతన్ని చూడకుండ ముఖం దాచుకుంటారు;

అతడు నిర్లక్ష్యం చేయబడ్డాడు, మనం అతన్ని చిన్న చూపు చూశాము.

4 ఖచ్చితంగా అతడు మన బాధలను భరించాడు.

మన రోగాలను భరించారు;

అయినా అతడు దేవునిచే శిక్షించబడ్డాడని

దెబ్బలు బాధలు అనుభవించాడని మనం అనుకున్నాము.

5 అయితే మన అతిక్రమాల కోసం అతడు గాయపడ్డాడు

మన దోషాల కారణంగా నలగ్గొట్టబడ్డాడు.

మనకు సమాధానం ఇచ్చే శిక్ష అతని మీద పడింది.

అతని గాయాల కారణంగా మనం స్వస్థత పొందాము.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 మేము విన్న విషయాలు ఎవరు నమ్ముతారు? యెహోవా బాహువు ఎవరికి వెల్లడి అయింది?

    2 ఆయన యెహోవా ఎదుట లేత మొక్కలాగా ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలాగా పెరిగాడు.

    అతనికి ఎలాంటి మంచి రూపంగానీ గొప్పదనంగానీ లేదు. మనలను ఆకర్షించే అందమేమీ ఆయనలో కనబడలేదు.

    3 ఆయన మనుష్యుల తృణీకారానికీ నిరాకరణకూ గురి అయ్యాడు. ఆయన విచారాలతో అస్తమానం బాధలతో నిండిపోయినవాడు.

    మన ముఖాలు ఆయనకు కనబడకుండా చేసుకున్నాం. ఆయన తృణీకారానికి గురి అయ్యాడు. ఆయనంటే మనకు లెక్కలేదు.

    4 అయితే ఆయన మన రోగాలను కచ్చితంగా భరించాడు. మన దుఖాలను మోశాడు.

    అయినా దేవుడు ఆయనను శిక్షించాడనీ దెబ్బ కొట్టి బాధించాడనీ మనం భావించుకున్నాం.

    5 కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది.

    మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.