3 అతడు మనుష్యులచే తృణీకరించబడి తిరస్కరించబడినవానిగా,
శ్రమలు అనుభవించినవానిగా, బాధను ఎరిగినవానిగా ఉన్నాడు.
ప్రజలు అతన్ని చూడకుండ ముఖం దాచుకుంటారు;
అతడు నిర్లక్ష్యం చేయబడ్డాడు, మనం అతన్ని చిన్న చూపు చూశాము.
4 ఖచ్చితంగా అతడు మన బాధలను భరించాడు.
మన రోగాలను భరించారు;
అయినా అతడు దేవునిచే శిక్షించబడ్డాడని
దెబ్బలు బాధలు అనుభవించాడని మనం అనుకున్నాము.