Pular para o conteúdo
Publicidade

యెషయా 53:4-6,11,12

OTSA Telugu Contemporary Version

4 ఖచ్చితంగా అతడు మన బాధలను భరించాడు.

మన రోగాలను భరించారు;

అయినా అతడు దేవునిచే శిక్షించబడ్డాడని

దెబ్బలు బాధలు అనుభవించాడని మనం అనుకున్నాము.

5 అయితే మన అతిక్రమాల కోసం అతడు గాయపడ్డాడు

మన దోషాల కారణంగా నలగ్గొట్టబడ్డాడు.

మనకు సమాధానం ఇచ్చే శిక్ష అతని మీద పడింది.

అతని గాయాల కారణంగా మనం స్వస్థత పొందాము.

6 మనమందరం గొర్రెల్లా దారి తప్పిపోయాము.

మనలో ప్రతి ఒక్కరూ తనకిష్టమైన దారిలో తిరిగిపోయారు.

యెహోవా మనందరి దోషాన్ని

అతని మీద మోపారు.

11 అతడు శ్రమ పొందిన తర్వాత

జీవిత వెలుగును53:11 కొ.ప్రా.ప్ర.లలో జీవిత వెలుగు అని లేదు చూసి తృప్తి చెందుతాడు53:11 లేదా తన శ్రమ యొక్క ఫలితం చూస్తాడు, తృప్తి చెందుతాడు;

నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానంతో అనేకమందిని సమర్థిస్తాడు,

వారి దోషాలను అతడు భరిస్తాడు.

12 కాబట్టి గొప్పవారితో నేనతనికి భాగం ఇస్తాను.

బలవంతులతో కలిసి అతడు దోపుడుసొమ్ము పంచుకుంటాడు.

ఎందుకంటే తన ప్రాణాన్ని మరణం పొందడానికి ధారపోసాడు,

అతడు అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు.

అతడు అనేకుల పాపభారాన్ని భరిస్తూ,

అపరాధుల గురించి విజ్ఞాపన చేశాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 అయితే ఆయన మన రోగాలను కచ్చితంగా భరించాడు. మన దుఖాలను మోశాడు.

    అయినా దేవుడు ఆయనను శిక్షించాడనీ దెబ్బ కొట్టి బాధించాడనీ మనం భావించుకున్నాం.

    5 కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది.

    మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం.

    6 మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము.

    యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు.

    11 తన వేదన వలన కలిగిన ఫలితం చూసి ఆయన సంతృప్తి పొందుతాడు.

    నీతిమంతుడైన నా సేవకుడు అనేకమంది దోషాలను భరించి తన జ్ఞానంతో వారిని నిర్దోషులుగా ఎంచుతాడు.

    12 కాబట్టి గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెడతాను. అనేకమందితో కలిసి అతడు కొల్లసొమ్ము పంచుకుంటాడు.

    ఎందుకంటే ఆయన తన ప్రాణం ధారపోసి చనిపోయాడు. అక్రమకారుల్లో ఒకడిగా ఆయన్ని ఎంచడం జరిగింది.

    ఆయన చాలామంది పాపాన్ని భరిస్తూ అపరాధుల కోసం విజ్ఞాపన చేశాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.