సీయోనుకు కలుగబోయే మహిమ
1 "గొడ్రాలా, పిల్లలు కననిదానా,
పాటలు పాడు.
ప్రసవవేదన పడనిదానా,
ఆనందంతో కేకలు వేయి.
ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లలకంటే
విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువగా ఉంటారు"
అని యెహోవా తెలియజేస్తున్నారు.
2 "నీ గుడారపు స్థలాన్ని పెద్దగా చేయి.
నీ గుడారపు తెరలను ఆటంకం లేకుండా
ముందుకు పొడిగించు
నీ త్రాళ్లను పొడవుగా చేయి.
నీ మేకుల్ని లోతుగా దిగగొట్టు.
11 "తుఫానులతో కొట్టుకుపోతూ ఓదార్పు లేక బాధపడుతున్న పట్టణమా,
వైడూర్యాలతో నేను నిన్ను తిరిగి కడతాను,
నీలమణులతో నీ పునాదులను వేస్తాను.
12 రత్నాలతో నీ కోట బురుజులపై గోడలు,
మెరిసే వజ్రాలతో నీ గుమ్మాలు
ప్రశస్తమైన రాళ్లతో నీకు గోడలు కడతాను.
13 యెహోవా నీ పిల్లలందరికి బోధిస్తారు
వారికి గొప్ప సమాధానం కలుగుతుంది.