19 ఇకమీదట పగలు సూర్యుని వెలుగు నీకు ఉండదు,
చంద్రుని వెన్నెల నీపై ప్రకాశించదు,
యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు.
నీ దేవుడు నీకు మహిమగా ఉంటారు.
20 నీ సూర్యుడికపై అస్తమించడు.
నీ చంద్రుడు క్షీణించడు.
యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు,
నీ దుఃఖ దినాలు అంతమవుతాయి.