4 తన కోసం ఎదురు చూసే వారి పక్షంగా కార్యం చేసే మిమ్మల్ని తప్ప
అనాది కాలం నుండి ఏ దేవున్ని ఎవరూ చూడలేదు
అలాంటి దేవుడు ఉన్నాడని ఎవరూ వినలేదు
ఎవరూ గ్రహించలేదు.
5 మీ మార్గాలను గుర్తుచేసుకుంటూ
సంతోషంగా సరియైనది చేసేవారికి సహాయం చేయడానికి మీరు వస్తారు.
అయితే మేము వాటికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నప్పుడు
మీరు కోప్పడ్డారు.
అలా అయితే మేము ఎలా రక్షింపబడగలం?