Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 19:4-6

OTSA Telugu Contemporary Version

4 పిలాతు మరొకసారి బయటకు వచ్చి యూదులతో, "చూడండి, ఇతనిలో నాకు ఏ నేరం కనిపించలేదని చెప్పడానికి ఈయనను బయటకు మీ దగ్గరకు తీసుకుని వస్తున్నాను" అని చెప్పాడు. 5 యేసు బయటకు వచ్చినప్పుడు ఆ ముళ్ళ కిరీటాన్ని ఊదా రంగు వస్త్రాన్ని ధరించుకొని ఉన్నారు. పిలాతు వారితో, "ఇదిగో, ఈ మనుష్యుడు!" అని చెప్పాడు.

6 ముఖ్య యాజకులు వారి అధికారులు ఆయనను చూడగానే, "సిలువ వేయండి! సిలువ వేయండి!" అని కేకలు వేశారు.

అయితే పిలాతు, "మీరే ఆయనను తీసుకెళ్లి సిలువ వేయండి. నాకైతే ఆయనలో ఏ నేరం కనిపించలేదు" అన్నాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    4 పిలాతు మళ్ళీ బయటకు వెళ్ళి ప్రజలతో, "ఈ మనిషిలో ఏ అపరాధం నాకు కనిపించలేదని మీకు తెలిసేలా ఇతణ్ణి మీ దగ్గరికి బయటకి తీసుకుని వస్తున్నాను" అని వారితో అన్నాడు. 5 కాబట్టి, యేసు బయటకు వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకుని, ఊదారంగు వస్త్రం ధరించి ఉన్నాడు. అప్పుడు పిలాతు వారితో, "ఇదిగో ఈ మనిషి!" అన్నాడు. 6 ముఖ్య యాజకులు, యూదుల అధికారులు యేసును చూసి, "సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి!" అని, కేకలు వేశారు. పిలాతు వారితో, "ఈయనలో నాకు ఏ అపరాధం కనిపించడం లేదు కాబట్టి మీరే తీసుకువెళ్ళి ఇతన్ని సిలువ వెయ్యండి" అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.