Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 20:14-16

OTSA Telugu Contemporary Version

14 అప్పుడు ఆమె వెనుకకు తిరిగి అక్కడ యేసు నిలబడి ఉన్నాడని చూసింది, కానీ ఆయనే యేసు అని ఆమె గుర్తు పట్టలేదు.

15 ఆయన, "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ఎవరిని వెదకుతున్నావు?" అని అడిగారు.

ఆమె ఆయనను తోటమాలి అనుకుని, "అయ్యా, నీవు ఆయనను తీసుకెళ్తే, ఆయనను ఎక్కడ ఉంచావో నాకు చెప్పు. నేను ఆయనను తీసుకెళ్తాను" అన్నది.

16 యేసు ఆమెను, "మరియ" అని పిలిచారు.

ఆమె ఆయన వైపుకు తిరిగి "రబ్బూనీ" అని పిలిచింది. రబ్బూనీ అనగా హెబ్రీ భాషలో "బోధకుడు" అని అర్థము.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    14 ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండడం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్టలేదు. 15 యేసు, "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు?" అని ఆమెను అడిగాడు. ఆమె ఆయనను తోటమాలి అనుకుంది. "అయ్యా, ఒకవేళ నువ్వు ఆయనను తీసుకు వెళ్తే ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయనను తీసుకుపోతాను" అంది.

    16 అప్పుడు యేసు ఆమెను చూసి, "మరియా" అని పిలిచాడు. ఆమె ఆయన వైపుకు తిరిగి, "రబ్బూనీ" అని పిలిచింది. రబ్బూనీ అనే మాటకు హీబ్రూ భాషలో ఉపదేశకుడు అని అర్థం.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.