22 అయితే మనం కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా?" అని యేసును అడిగారు.
23 ఆయన వారి కుయుక్తిని ఎరిగి, వారితో, 24 "నాకు ఒక దేనారాన్ని చూపించండి, దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?" అని అడిగారు.
అందుకు వారు, "కైసరువి" అన్నారు.
25 అప్పుడు ఆయన, "అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి" అని వారితో చెప్పారు.