8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. ‘అబ్రాహాము మాకు తండ్రిగా ఉన్నాడు’ అని మీలో మీరు అనుకోవడం మొదలుపెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి కూడా అబ్రాహాముకు సంతానం కలుగజేయగలడు అని మీతో చెప్తున్నాను.
12 పన్ను వసూలు చేసేవారు కూడ బాప్తిస్మం పొందడానికి వచ్చారు. వారు, "బోధకుడా, మేము ఏమి చేయాలి?" అని అడిగారు.
13 అందుకు అతడు వారితో, "మీకు నిర్ణయించబడిన పన్ను కంటే ఎక్కువ తీసుకోవద్దు" అని చెప్పాడు.