Pular para o conteúdo
Publicidade

మార్కు సువార్త 2:23-28

OTSA Telugu Contemporary Version

యేసు సబ్బాతుకు ప్రభువు

23 ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు, ఆయనతో పాటు నడుస్తున్న శిష్యులు, కొన్ని కంకులు తెంపుకొని తినడం మొదలుపెట్టారు. 24 అది చూసిన పరిసయ్యులు, "చూడు, ఎందుకు వారు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు?" అని ఆయనతో అన్నారు.

25 అందుకు ఆయన, "దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా? 26 ప్రధాన యాజకుడైన అబ్యాతారు దినాల్లో, అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకుని తాను తిని, తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు" అని జవాబిచ్చారు.

27 ఆయన వారితో, "మనుష్యుల కోసం సబ్బాతు దినం కాని, సబ్బాతు దినం కోసం మనుష్యులు నియమించబడలేదు. 28 కాబట్టి మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి కూడ ప్రభువు" అని చెప్పారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    23 విశ్రాంతి దినాన ఆయన పంట చేలలో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు తాము తినడానికి కొన్ని ధాన్యం కంకులను తుంచారు. 24 పరిసయ్యులు, "చూడు, నీ శిష్యులు విశ్రాంతి దినాన చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?" అని ఆయనను అడిగారు. 25 అందుకాయన వారితో ఇలా అన్నాడు, "దావీదు, అతనితో ఉన్నవారు అవసరంలో ఆకలిగా ఉన్నప్పుడు అతడు చేసింది మీరు చదవలేదా? 26 అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి పెట్టలేదా?" అన్నాడు.

    27 ఆయన మళ్ళీ వారితో ఇలా అన్నాడు, "విశ్రాంతి దినం మనుషుల కోసమేగాని మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు. 28 అందుచేత మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే!" అని వారితో చెప్పాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.