17 ఆ జనసమూహంలో నుండి ఒకడు, "బోధకుడా, మూగ దయ్యం పట్టిన నా కుమారుని తీసుకువచ్చాను.
22 అది వాన్ని చంపాలని చాలాసార్లు నిప్పుల్లో, నీళ్లలో పడవేసింది. ఒకవేళ నీ వలనైతే, మమ్మల్ని కనికరించి మాకు సహాయం చేయి" అన్నాడు.
23 అందుకు యేసు, " ‘నీ వలనైతే?’ అని అడిగి, ఒక వ్యక్తి నమ్మితే సమస్తం సాధ్యమే" అని అతనితో చెప్పారు.
24 వెంటనే ఆ చిన్నవాని తండ్రి, "నేను నమ్ముతున్నాను; నా అపనమ్మకాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి!" అని అరిచాడు.