18 మీలాంటి దేవుడెవరు?
మీరు మీ వారసత్వమైన వారిలో మిగిలిన వారి
పాపాలను మన్నించి, అతిక్రమాలను క్షమిస్తారు,
మీరు నిత్యం కోపంతో ఉండరు
కాని దయ చూపడంలో ఆనందిస్తారు.
19 మీరు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తారు;
మీరు మా పాపాలను అణగద్రొక్కుతారు,
మా అతిక్రమాలన్నిటిని సముద్రంలో లోతుల్లో పడవేస్తారు.