1 రాజైన లెమూయేలు సూక్తులు; అతని తల్లి అతనికి బోధించిన ప్రేరేపిత మాటలు.
2 నా కుమారుడా! ఆలకించు, నా గర్భంలో మోసిన నా కుమారుడా, ఆలకించు
నా మ్రొక్కుబడులకు జవాబైన నా కుమారుడా, ఆలకించు!
3 నీ బలమును ఆడవారి కోసం ఖర్చు చేయవద్దు,
రాజులను పతనము చేసేవారి కోసం నీ శక్తిని ఖర్చు చేయవద్దు.
4 లెమూయేలూ, ఇది రాజులకు తగినది కాదు,
మద్యపానం సేవించుట రాజులకు తగినది కాదు,
పాలకులు మద్యము కోసం ఆరాటపడకూడదు,
8 తమ గురించి తాము మాట్లాడలేని వారి కోసం,
నిరాశ్రయులందరి హక్కుల కోసం మాట్లాడండి.
9 మాట్లాడండి న్యాయంగా తీర్పు తీర్చండి;
దీనుల, అవసరతలో ఉన్న వారి హక్కులను పరిరక్షించండి.