Pular para o conteúdo
Publicidade

O sentido da vida: o que a Bíblia ensina sobre existir

O que a Bíblia ensina sobre a vida

A Bíblia define a vida como uma dádiva que se origina no fôlego de Deus e encontra seu sentido pleno em Jesus Cristo. Existir não é um acidente biológico nem um acúmulo de bens, mas uma caminhada de comunhão com o Criador que começa no ventre e se estende por toda a eternidade.

యెహోవా దేవుడు నేల మట్టితో మనుష్యుని చూడండి). చేసి, అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవి అయ్యాడు.(ఆది 2:7)

నా అంతరంగాన్ని మీరు సృష్టించారు;

నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు.

నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి,

అది నాకు పూర్తిగా తెలుసు.

రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు,

భూమి అగాధ స్థలాల్లో నేను ఒక్కటిగా అల్లబడినప్పుడు,

నా రూపము మీ నుండి మరుగు చేయబడలేదు.

నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి;

నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే

అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి.(కీర్తనలు 139:13-16)

ఎందుకంటే మీ దగ్గర జీవపుఊట ఉంది;

మీ వెలుగులోనే మేము వెలుగును చూడగలము.(కీర్తనలు 36:9)

నా జీవితకాలమంతా నేను యెహోవాకు పాడతాను;

నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి నేను స్తుతిగానం చేస్తాను.(కీర్తనలు 104:33)

ఊపిరి ఉన్న ప్రతిదీ యెహోవాను స్తుతించాలి.

యెహోవాను స్తుతించండి.(కీర్తనలు 150:6)

A vida plena e eterna em Cristo

No Novo Testamento, a vida humana alcança sua dimensão mais profunda quando ligada a Jesus. Ele não se apresenta apenas como alguém que ensina a viver melhor, mas como a própria vida: quem crê nele recebe perdão, transformação diária e a certeza da ressurreição.

అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, "నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు.(యోహాను సువార్త 14:6)

దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి వస్తాడు. అయితే నేను గొర్రెలకు జీవం కలిగించాలని, అది సమృద్ధిగా కలిగించాలని వచ్చాను.(యోహాను సువార్త 10:10)

యేసు, "పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు. బ్రతికి ఉండి నన్ను నమ్మినవారు ఎప్పుడూ చనిపోరు. నీవు ఇది నమ్ముతున్నావా?" అని ఆమెను అడిగారు.(యోహాను సువార్త 11:25,26)

అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: "జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు.(యోహాను సువార్త 6:35)

లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రకారం, నన్ను నమ్మేవారి అంతరంగంలో నుండి జీవజలధారలు ప్రవహిస్తాయి" అని బిగ్గరగా చెప్పారు.(యోహాను సువార్త 7:38)

నీవు మాత్రమే నిజ దేవుడవని, యేసు క్రీస్తు నీవు పంపినవాడని వారు తెలుసుకోవడమే నిత్యజీవం.(యోహాను సువార్త 17:3)

పాపం వలన వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం వలన మన ప్రభువైన యేసు క్రీస్తులో నిత్యజీవం లభిస్తుంది.(రోమా పత్రిక 6:23)

నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అర్పించుకొన్న దేవుని కుమారునియందు విశ్వాసముంచడం వల్ల జీవిస్తున్నాను.(గలతీ పత్రిక 2:20)

A brevidade dos dias e a busca por sabedoria

A Escritura trata a existência terrena com realismo: os anos passam rápido e o vigor físico diminui. Longe de gerar desânimo, essa fragilidade serve de alerta para administrar o tempo com maturidade e buscar um coração prudente.

మా ఆయుష్షు డెబ్బై సంవత్సరాలు,

అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు;

అయినా వాటి వైభవం నాశనం దుష్టత్వం,

అవి త్వరగా గడచిపోతాయి, మేము ఎగిరిపోతాం.(కీర్తనలు 90:10)

మా దినాలను లెక్కించడం మాకు నేర్పండి,

తద్వార మేము జ్ఞానంగల హృదయాన్ని సంపాదించగలము.(కీర్తనలు 90:12)

"యెహోవా, నా జీవిత ముగింపు

నా రోజుల సంఖ్యను నాకు చూపించండి;

నా జీవితం ఎంత అనిశ్చయమైనదో నాకు తెలియజేయండి.

మీరు నా దినాలను కేవలం బెత్తెడంత చేశారు;

నా జీవితకాలం మీ ఎదుట శూన్యము.

భద్రత గలవారిగా అనిపించినా,

మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా

"నిశ్చయంగా మనుష్యులు కేవలం నీడలా తిరుగుతున్నారు;

వారి ధనం ఎవరికి దక్కుతుందో తెలియకుండానే

వారు వ్యర్థంగా ధనం సమకూర్చుకుంటారు.(కీర్తనలు 39:4-6)

ప్రతిదానికీ ఒక సమయం ఉంది,

ఆకాశాల క్రింద ప్రతీ కార్యకలాపానికి ఒక కాలం ఉంది:(ప్రసంగి 3:1)

నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం,

అది నీతి మార్గంలో సాధించబడుతుంది.(సామెతలు 16:31)

చాలా జాగ్రత్తగా ఉండండి, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల్లా జీవించండి. దినాలు చెడ్డవి కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.(ఎఫెసీ పత్రిక 5:15,16)

Prioridades e o perigo do apego material

Jesus adverte que a ansiedade por roupas, comida ou patrimônio sufoca o que realmente importa. A vida de uma pessoa não consiste na quantidade dos bens que ela acumula; ganhar o mundo inteiro não compensa perder a própria alma.

"కాబట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి? అని మీ ప్రాణం గురించి గాని లేదా ఏమి ధరించాలి అని మీ దేహం గురించి గాని చింతించకండి. ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి. గాలిలో ఎగిరే పక్షులను చూడండి; అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. మీరు వాటికన్నా ఇంకా ఎంతో విలువైన వారు కారా? మీలో ఒక్కరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా?(మత్తయి సువార్త 6:25-27)

ఆ తర్వాత ఆయన వారితో, "మెలకువగా ఉండండి! మీరు అన్ని రకాల అత్యాశలకు విరుద్ధంగా ఉండేలా జాగ్రత్తపడండి; జీవితం అంటే సమృద్ధిగా ఆస్తులు కలిగి ఉండడం కాదు" అని చెప్పారు.(లూకా సువార్త 12:15)

ఎవరైనా లోకమంతా సంపాదించుకుని, తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం?(మార్కు సువార్త 8:36)

ఆ తర్వాత యేసు జనసమూహంతో పాటు తన శిష్యులను తన దగ్గరకు పిలిచి వారితో ఈ విధంగా చెప్పారు: "ఎవరైనా నా శిష్యునిగా ఉండాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవారు దానిని పోగొట్టుకుంటారు, కానీ నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా తెగించేవారు దానిని దక్కించుకుంటారు. ఎవరైనా లోకమంతా సంపాదించుకుని, తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా తమ ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వగలరు? ఈ వ్యభిచార, పాపిష్ఠి తరం మధ్యలో నా గురించి గాని, నా మాటల గురించి గాని ఎవరైనా సిగ్గుపడితే, మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో పరిశుద్ధ దూతలతో పాటు వచ్చినప్పుడు ఆయన వారి గురించి సిగ్గుపడతాడు."(మార్కు సువార్త 8:34-38)

ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు.(రోమా పత్రిక 12:2)

Como conduzir a vida no dia a dia

Viver com sabedoria exige atenção constante às palavras, aos pensamentos e aos relacionamentos. O livro de Provérbios e as cartas apostólicas mostram que integridade, domínio próprio e busca pela paz sustentam uma vida saudável diante de Deus e do próximo.

నా కుమారుడా, ఆలకించు, నేను చెప్తుంది అంగీకరించు,

నీవు దీర్ఘకాలం జీవిస్తావు.(సామెతలు 4:10)

అన్నిటికి మించి, నీ హృదయాన్ని కాపాడుకో,

ఎందుకంటే నీ హృదయంలోనుండి జీవన వనరులు ప్రవహిస్తాయి.(సామెతలు 4:23)

క్రమశిక్షణ పాటించేవారు జీవితానికి మార్గం చూపుతారు,

కాని దిద్దుబాటును పట్టించుకోనివారు ఇతరులను దారి తప్పిస్తారు.(సామెతలు 10:17)

తమ పెదవులను కాచుకునేవారు తమ ప్రాణాలు కాపాడుకుంటారు,

కాని దురుసుగా మాట్లాడేవారు పతనమవుతారు.(సామెతలు 13:3)

యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవపుఊట,

అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది.(సామెతలు 14:27)

తెలివి సంపాదించుకునేవారు తన ప్రాణమునకు ప్రేమించేవారు;

మంచి చెడులను లెక్కచేయువారు మేలు పొందును.(సామెతలు 19:8)

నీతిని శాశ్వత ప్రేమను వెంటాడేవాడు

ప్రాణాన్ని, వృద్ధిని, ఘనతను పొందుతాడు.(సామెతలు 21:21)

నీరు ముఖాన్ని ప్రతిబింబించినట్లు,

మనుష్యుని జీవితం హృదయాన్ని ప్రతిబింబిస్తుంది.(సామెతలు 27:19)

మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని, ఆయన మార్గంలో నడుచుకోవాలని, ఆయన ఆజ్ఞలు, శాసనాలు, చట్టాలను పాటించాలని నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపిస్తున్నాను; అప్పుడు మీరు జీవిస్తారు, వృద్ధిచెందుతారు, మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశించే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.(ద్వితీయో 30:16)

మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు ఎక్కువకాలం జీవించేలా మీ తండ్రిని తల్లిని గౌరవించాలి.(నిర్గమ 20:12)

మీలో ఎవరైతే జీవితాన్ని ప్రేమిస్తారో

ఎవరు ఎక్కువ మంచి రోజులను చూడాలనుకుంటారో

మీరు చెడు పలుకకుండ మీ నాలుకను,

అబద్ధాలు చెప్పకుండ తమ పెదవులను అదుపులో పెట్టుకోవాలి.

కీడు చేయడం మాని మేలు చేయాలి;

సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.(కీర్తనలు 34:12-14)

ఎందుకంటే,

"ఎవరైనా జీవితాన్ని ప్రేమించి

మంచి దినాలను చూడాలనుకుంటారో

వారు చెడు మాట్లాడకుండ నాలుకను

మోసపు మాటలు చెప్పకుండ తమ పెదవులను కాచుకోవాలి.

వారు కీడు చేయడం మాని మేలు చేయాలి;

వారు సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.(1 పేతురు పత్రిక 3:10,11)

అందరితో సమాధానం కలిగి జీవించడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేయండి; పరిశుద్ధత లేకుండ ఎవరు ప్రభువును చూడలేరు.(హెబ్రీ పత్రిక 12:14)

ఆ ప్రేమ ద్వారా సమాధానకరమైన జీవితాన్ని గడపడమే మీ ధ్యేయంగా పెట్టుకొని, మేము మీకు చెప్పిన విధంగా ఇతరుల జోలికి పోకుండా మీ సొంత విషయాలనే చూసుకుంటూ మీ చేతులతో కష్టపడి పని చేయండని మిమ్మల్ని వేడుకొంటున్నాము. అప్పుడు మీ అనుదిన జీవితం బయటి వారి గౌరవాన్ని గెలుచుకుంటుంది, మీరు ఎవరిపైనా ఆధారపడేవారిగా ఉండరు.(1 థెస్సలోనికయులకు 4:11,12)

మీరు ఏమి చేసినా, అది మనుష్యుల మెప్పు కోసం కాకుండా ప్రభువు కోసం చేస్తున్నామని హృదయపూర్వకంగా చేయండి. మీరు ప్రభువు నుండి స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుకుంటారని మీకు తెలుసు కాబట్టి మీరు ప్రభువైన క్రీస్తునే సేవిస్తున్నారు.(కొలొస్సీ పత్రిక 3:23,24)

శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు.(యాకోబు పత్రిక 1:12)

మీలో జ్ఞానం, గ్రహింపు కలవారు ఎవరు? జ్ఞానం వలన వచ్చిన సహనంతో మీ క్రియలను మీ మంచి ప్రవర్తన ద్వారా చూపించాలి.(యాకోబు పత్రిక 3:13)

Confiança e proteção nas dificuldades

Mesmo nos momentos de dor e esgotamento, a oração dos salmistas lembra que Deus permanece como refúgio acessível. A paz diária não depende da ausência de problemas, mas da certeza de que cada passo é guardado pelo Criador.

నిశ్చయంగా నా జీవితకాలమంతా

మీ మంచితనం మీ మారని ప్రేమ నావెంటే ఉంటాయి.

నేను నిరంతరం

యెహోవా మందిరంలో నివసిస్తాను.(కీర్తనలు 23:6)

యెహోవా, మీ మార్గాలేవో నాకు చూపండి.

మీ పద్ధతులను నాకు ఉపదేశించండి.(కీర్తనలు 25:4)

యెహోవాను ఒకటి అడిగాను,

నేను కోరింది ఇదే;

యెహోవా ప్రసన్నతను చూస్తూ

ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ

నా జీవితకాలమంతా

నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.(కీర్తనలు 27:4)

మీరు నా కొండ, నా కోట;

మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి.(కీర్తనలు 31:3)

యెహోవా ముందు మౌనంగా ఉండు

ఆయన కోసం ఓర్పుతో వేచి ఉండు.

ప్రజలు వారి మార్గాల్లో విజయవంతమైనప్పుడు

వారు తమ దుష్ట పన్నాగాలు అమలు చేసినప్పుడు చింతించకు.(కీర్తనలు 37:7)

నా శరీరం నా హృదయం నీరసిస్తాయేమో,

కాని నిత్యం నా దేవుడు నా హృదయానికి బలం

నిత్యం నా స్వాస్థ్యం.(కీర్తనలు 73:26)

నేను మీ కట్టడలు ఎన్నడు మరువను,

ఎందుకంటే వాటి ద్వార మీరు నా జీవితాన్ని కాపాడారు.(కీర్తనలు 119:93)

సమస్త హాని కలుగకుండా యెహోవా నిన్ను కాపాడతారు

ఆయన నీ ప్రాణాన్ని కాపాడతారు.

ఇప్పటినుండి నిరంతరం నీ రాకపోకలలో

యెహోవా నిన్ను కాపాడును.(కీర్తనలు 121:7,8)

Seja o primeiro

Este artigo te tocou? Faça uma oração!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.