Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 23

దావీదు కీర్తన

1 యెహోవా నా కాపరి, నాకు ఏ కొరత లేదు.

2 పచ్చిక ఉన్నచోట ఆయన నన్ను పడుకోనిస్తారు.

ప్రశాంత జలాల ప్రక్కన ఆయన నన్ను నడిపిస్తారు.

3 ఆయన నా ప్రాణానికి సేదదీరుస్తారు.

ఆయన తన నామం కోసం

నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తారు.

4 మృత్యు నీడలా ఉన్న లోయలో23:4 లేదా గాఢాంధకారపు లోయలో

నేను నడిచినా,

ఏ కీడుకు భయపడను,

ఎందుకంటే మీరు నాతో ఉన్నారు;

మీ దండం మీ చేతికర్ర

నన్ను ఆదరిస్తాయి.

5 నా శత్రువులు ఉన్న చోటనే

మీరు నాకు బల్ల సిద్ధం చేస్తారు.

నూనెతో నా తల అభిషేకించారు;

నా పాత్ర నిండి పొర్లుతుంది.

6 నిశ్చయంగా నా జీవితకాలమంతా

మీ మంచితనం మీ మారని ప్రేమ నావెంటే ఉంటాయి.

నేను నిరంతరం

యెహోవా మందిరంలో నివసిస్తాను.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.