5 బ్రతికి ఉన్నవారికి తాము చనిపోతామని తెలుసు,
కాని చనిపోయినవారికి ఏమి తెలియదు;
వారికి ఏ బహుమతి లేదు,
వారి పేరు కూడా మర్చిపోతారు.
6 వారి ప్రేమ, వారి ద్వేషం
వారి అసూయ చాలా కాలం క్రితమే అంతరించిపోయాయి;
సూర్యుని క్రింద జరిగే ఏ విషయంలో
వారికిక ఏ భాగం ఉండదు.
10 మీ చేతికి వచ్చిన ఏ పనియైనా శక్తివంచన లేకుండా చేయండి. ఎందుకంటే మీరు వెళ్తున్న పాతాళంలో పని చేయడం గాని ప్రణాళిక వేయడం గాని లేదా తెలివి గాని జ్ఞానం గాని ఉండవు.