Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 100

స్తుతి అర్పణ కీర్తన

1 భూలోకమంతా యెహోవాను స్తుతిస్తూ ఆనంద ధ్వనులు చేయాలి.

2 సంతోష పూర్వకంగా యెహోవాను సేవించండి;

పాడుతూ ఆయన సన్నిధిలోకి రండి.

3 యెహోవాయే దేవుడని గ్రహించండి.

ఆయనే మన సృష్టికర్త, మనం ఆయన వారం;

మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం.

4 కృతజ్ఞతతో ఆయన ద్వారాల గుండా ప్రవేశించండి,

స్తుతితో ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి;

ఆయనకు వందనాలు చెల్లించండి, ఆయన నామమును స్తుతించండి.

5 యెహోవా మంచివారు ఆయన మారని ప్రేమ శాశ్వతమైనది;

ఆయన నమ్మకత్వం తరతరాలకు ఉంటుంది.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.