Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 103:8-12

OTSA Telugu Contemporary Version

8 యెహోవా కృపా కనికరం గలవారు,

త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు.

9 ఆయన ఎల్లప్పుడూ మనమీద నేరారోపణ చేయరు,

శాశ్వతంగా కోపం పెట్టుకోరు;

10 మన పాపాలకు తగినట్లుగా ఆయన మనతో వ్యవహరించలేదు

మన దోషాలకు ప్రతిగా మనకు తిరిగి చెల్లించలేదు.

11 భూమికంటె ఆకాశం ఎంత ఎత్తున ఉందో,

తనకు భయపడేవారి పట్ల ఆయన ప్రేమ అంత ఉన్నతం.

12 పడమటికి తూర్పు ఎంత దూరమో,

అంత దూరం ఆయన మన అతిక్రమాలను తొలగించారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    8 యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది.

    9 ఆయన ఎప్పుడూ అదుపులో పెట్టేవాడు కాదు. ఆయన అస్తమానం కోపంగా ఉండడు.

    10 మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు.

    11 భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.

    12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.