4 యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు;
యెహోవా తన పరలోక సింహాసనంపై ఆసీనులై ఉన్నారు;
ఆయన భూమి మీద నరులను పరిశీలిస్తున్నారు;
ఆయన కళ్లు వారిని పరీక్షిస్తున్నాయి.
5 యెహోవా నీతిమంతులను పరీక్షిస్తారు,
కాని దుష్టులను, దౌర్జన్యాన్ని ప్రేమించేవారిని
ఆయన అసహ్యించుకుంటారు.
6 దుష్టుల మీద ఆయన
నిప్పు కణాలు అగ్ని గంధకం కురిపిస్తారు;
వడగాలి వారి భాగం అవుతుంది.
7 యెహోవా నీతిమంతుడు,
ఆయన న్యాయాన్ని ప్రేమిస్తారు;
యథార్థవంతులు ఆయన ముఖాన్ని చూస్తారు.