Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 112

1 యెహోవాను స్తుతించండి.112:1 హెబ్రీలో హల్లెలూయా

యెహోవాకు భయపడేవారు ధన్యులు,

వారు ఆయన ఆజ్ఞలలో అధిక ఆనందాన్ని పొందుతారు.

2 వారి పిల్లలు భూమిపై బలవంతులుగా ఉంటారు;

యథార్థవంతుల తరం దీవించబడుతుంది.

3 వారి ఇళ్ళలో ధనం, ఐశ్వర్యం ఉన్నాయి,

వారి నీతి నిత్యం నిలిచి ఉంటుంది.

4 దయ కనికరం గలవారికి నీతిమంతులకు,

యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు ఉదయిస్తుంది.

5 దయతో అప్పు ఇచ్చేవారికి,

తమ వ్యాపారాన్ని న్యాయంగా నిర్వహించే వారికి మేలు కలుగుతుంది.

6 నీతిమంతులు ఎప్పటికీ కదల్చబడరు;

వారు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు.

7 దుర్వార్తల వలన వారు భయపడరు;

యెహోవా అందలి నమ్మకం చేత వారి హృదయం స్థిరంగా ఉంటుంది.

8 వారి హృదయాలు భద్రంగా ఉన్నాయి, వారికి భయం ఉండదు;

చివరికి వారు తమ శత్రువులపై విజయంతో చూస్తారు.

9 వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు,

వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది;

వారి కొమ్ము112:9 కొమ్ము ఇక్కడ ఠీవిని సూచిస్తుంది. ఘనత పొంది హెచ్చింపబడుతుంది.

10 దుష్టులు చూసి విసుగుచెందుతారు,

వారు పండ్లు కొరుకుతూ క్షీణించి పోతారు;

దుష్టుల ఆశలు విఫలమవుతాయి.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.