9 యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు?
మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే.
11 నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని
మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను.
15 మీ శాసనాలను నేను ధ్యానిస్తాను
మీ మార్గాలను పరిగణిస్తాను.
16 మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను;
నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను.
ג గీమెల్
47 నేను మీ ఆజ్ఞలలో ఆనందిస్తాను
ఎందుకంటే అవంటే నాకు ప్రేమ.
48 నేను ప్రేమించే మీ ఆజ్ఞల వైపు నా చేతులెత్తుతాను,
తద్వారా నేను మీ శాసనాలను ధ్యానిస్తాను.
ז జాయిన్
97 ఓ, మీ ధర్మశాస్త్రం అంటే నాకెంత ఇష్టమో!
నేను రోజంతా దానిని ధ్యానిస్తాను.
98 మీ ఆజ్ఞలు ఎల్లప్పుడు నాతో ఉండి
నా శత్రువుల కన్నా నన్ను జ్ఞానిగా చేస్తాయి.
99 నేను మీ శాసనాలను ధ్యానిస్తాను కాబట్టి
నా ఉపదేశకులందరి కంటే నేను ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నాను.
100 నేను మీ కట్టడలను ఆచరిస్తాను కాబట్టి
వృద్ధులకు మించిన గ్రహింపు నేను కలిగి ఉన్నాను.
105 మీ వాక్కు నా పాదాలకు దీపం,
నా త్రోవకు వెలుగు.
147 నేను తెల్లవారక ముందే లేచి సహాయం కోసం మొరపెడతాను;
నేను మీ వాక్కులలో నిరీక్షణ ఉంచాను.
148 మీ వాగ్దానాలను నేను ధ్యానించేలా,
రాత్రి జాములంతా నా కళ్లు తెరిచి ఉంటాయి.