1-5 మనుష్యులు మనపై దాడి చేసినప్పుడు
వారి కోపం మనపై రగులుకొన్నప్పుడు
యెహోవా మనకు తోడై ఉండకపోతే
వారు మనల్ని సజీవంగానే మ్రింగివేసేవారు;
వరద మన మీదుగా పొర్లి ఉండేది,
జలప్రవాహం మనల్ని ముంచేసి
జలప్రవాహాల పొంగు మనల్ని తుడిచిపెట్టి ఉండేది
అని ఇశ్రాయేలు చెప్పును గాక.