Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 126

యాత్రకీర్తన.

1 యెహోవా సీయోను భాగ్యాలను పునరుద్ధరించినప్పుడు,

మనం కలలుగన్న వారిలా ఉన్నాము.

2 మన నోరు నవ్వుతో నింపబడింది,

మన నాలుకలు సంతోషగానాలతో నిండి ఉన్నాయి.

"యెహోవా వీరి కోసం గొప్పకార్యాలు చేశారు" అని

ఇతర దేశాలు చెప్పుకున్నాయి.

3 యెహోవా మన కోసం గొప్పకార్యాలు చేశారు,

మనం ఆనందభరితులం అయ్యాము.

4 దక్షిణ దేశంలో ప్రవాహాలు ప్రవహించేలా,

యెహోవా, మా భాగ్యాలను126:4 లేదా చెరలోనున్న మా వారిని తిరిగి రప్పించండి తిరిగి రప్పించండి.

5 కన్నీటితో విత్తేవారు

సంతోషగానాలతో పంట కోస్తారు.

6 విత్తనాలను పట్టుకుని,

ఏడుస్తూ విత్తడానికి వెళ్లినవారు,

సంతోషగానాలతో పనలు మోసుకువస్తారు.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.