1 యెహోవా ఇల్లు కడితేనే తప్ప
దానిని కట్టే వారి శ్రమ అంతా వ్యర్థమే.
యెహోవా పట్టణాన్ని కావలి ఉండకపోతే
దాన్ని కాపలా కాసేవారు నిలబడి కాయడం వ్యర్థమే.
2 మీరు ప్రొద్దున్నే లేచి
ఆలస్యంగా పడుకొంటూ,
కష్టపడి పని చేస్తూ ఆహారం తినడం వ్యర్థమే.
ఆయన ప్రేమించేవారు నిద్రిస్తునప్పుడు కూడా యెహోవా సమకూరుస్తారు.