Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 128

యాత్రకీర్తన.

1 యెహోవా పట్ల భయం కలిగి,

ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.

2 మీరు మీ కష్టార్జితాన్ని తింటారు;

ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది.

3 మీ ఇంట్లో మీ భార్య

ఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది;

మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలు

ఒలీవ మొక్కల్లా ఉంటారు.

4 యెహోవా పట్ల భయం కలవారు

ఈ విధంగా ఆశీర్వదించబడతారు.

5 సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు;

మీ జీవితకాలమంతా

యెరూషలేము అభివృద్ధిని చూస్తారు.

6 మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారు

ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.