1 యెహోవా మీరు నన్ను పరిశోధించారు,
మీరు నన్ను తెలుసుకొన్నారు.
2 నేను కూర్చోవడం నేను లేవడం మీకు తెలుసు;
దూరం నుండే నా తలంపులు మీరు గ్రహించగలరు.
3 నేను బయటకు వెళ్లడాన్ని పడుకోవడాన్ని మీరు పరిశీలిస్తారు;
నా మార్గాలన్నీ మీకు బాగా తెలుసు.
5 నా వెనుక నా ముందు మీరు చుట్టి ఉంటారు,
మీ దయగల చేతిని నా మీద ఉంచుతారు.