1 నేను గొంతెత్తి యెహోవాకు ఆక్రందన చేస్తున్నాను;
దయ కోసం యెహోవాకు కంఠమెత్తి ప్రాధేయపడుతున్నాను.
2 ఆయన ఎదుట నా ఫిర్యాదు వెల్లడి చేసుకుంటాను;
నా కష్టాల గురించి ఆయనకు చెప్పుకుంటాను.
3 నా ఆత్మ నాలో సొమ్మసిల్లినప్పుడు
మీరే నా నడకను చూస్తారు.
నేను నడచే దారిలో,
శత్రువులు రహస్యంగా ఉచ్చులు ఉంచారు.
4 చూడండి, నా కుడివైపు ఎవరు లేరు;
ఎవరు నా గురించి పట్టించుకోరు
నాకు ఆశ్రయం లేదు;
ఒక్కరైన నాపై దయ చూపించరు.
5 యెహోవా, మీకు మొరపెట్టుకుంటున్నాను;
"నా ఆశ్రయం మీరే,
సజీవుల దేశంలో నా స్వాస్థ్యం మీరే" అని నేనంటాను.