Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 145:8-12

OTSA Telugu Contemporary Version

8 యెహోవా కృప కలవారు, దయ గలవారు,

త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు.

9 యెహోవా అందరికి మంచివారు;

ఆయన చేసిన సృష్టి అంతటి మీద దయ గలవాడు.

10 యెహోవా మీ సృష్టంతా మిమ్మల్ని స్తుతిస్తుంది;

నమ్మకమైన మీ ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు.

11 మీ రాజ్య మహిమ గురించి వారు చెపుతారు

మీ బలము గురించి మాట్లాడతారు,

12 అప్పుడు మనుష్యులందరు మీ గొప్ప చర్యలను

మీ రాజ్యము యొక్క మహిమా వైభవాన్ని తెలుసుకుంటారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    8 యెహోవా దయ, వాత్సల్యం గలవాడు. ఆయన కోపం విషయంలో నిదానించే వాడు. నిబంధన విశ్వసనీయత ఆయనలో పొంగి పొరలుతూ ఉంది.

    9 యెహోవా అందరికీ మేలు చేస్తాడు. సృష్టి అంతటి మీదా ఆయన వాత్సల్యం చూపుతాడు.

    10 యెహోవా నీ క్రియలన్నిటిని బట్టి నువ్వు స్తుతి ప్రశంసలకు పాత్రుడవు. నీ భక్తులు నిన్ను సన్నుతిస్తారు.

    11 నీ భక్తులు నీ రాజ్యవైభవాన్ని గురించి, నీ ప్రభావాన్ని గురించి మాట్లాడుకుంటారు.

    12 మహోన్నతమైన నీ రాజ్య ప్రాభవాన్ని, నీ శక్తి సామర్ధ్యాలను ప్రజలకు తెలపడానికి నీ బలప్రభావాలను గూర్చి మాట్లాడతారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.