Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 146

1 యెహోవాను స్తుతించండి,

నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.

2 జీవితమంతా యెహోవాను స్తుతిస్తాను;

నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి స్తుతి పాడతాను.

3 రాజుల మీద నమ్మకం ఉంచకండి,

నరులు మిమ్మల్ని రక్షించలేరు.

4 వారి ఆత్మ వారిని విడిచినప్పుడు, మట్టిలో కలిసిపోతారు;

వారి ప్రణాళికలు ఆ రోజే అంతరించిపోతాయి.

5 ఎవరికి యాకోబు యొక్క దేవుడు అండగా ఉంటారో,

ఎవరైతే వారి దేవుడైన యెహోవాలో నిరీక్షణ కలిగి ఉంటారో, వారు ధన్యులు.

6 ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని,

వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించినవాడు ఆయనే.

ఆయన ఎప్పటికీ నమ్మదగినవాడు.

7 ఆయన అణగారిన వారికి న్యాయం చేకూరుస్తారు,

ఆకలిగొనిన వారికి ఆహారం ఇస్తారు.

యెహోవా చెరసాలలో ఉన్నవారిని విడిపిస్తారు,

8 యెహోవా గుడ్డివారికి చూపునిస్తారు,

యెహోవా క్రుంగి ఉన్నవారిని లేవనెత్తుతారు,

యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు.

9 యెహోవా పరదేశీయులను కాపాడతారు.

తండ్రిలేని అనాధ పిల్లలను, విధవరాండ్రను ఆదరిస్తారు.

కాని దుష్టుల ప్రణాళికలను ఆయన వ్యతిరేకిస్తారు.

10 యెహోవా శాశ్వతకాలం పరిపాలిస్తారు.

సీయోను, మీ దేవుడు తరతరాలకు రాజ్యమేలుతారు.

యెహోవాను స్తుతించండి.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.