Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 17:6-9

OTSA Telugu Contemporary Version

6 నా దేవా! నేను మీకు మొరపెడతాను, మీరు నాకు జవాబిస్తారు;

మీ చెవి నా వైపు త్రిప్పి నా ప్రార్థన ఆలకించండి.

7 మారని మీ ప్రేమలోని అద్భుతాలను నాకు చూపించండి,

తమ శత్రువుల నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఆశ్రయించే వారిని

మీ కుడిచేతితో మీరు రక్షిస్తారు.

8,9 నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుష్టుల నుండి,

నన్ను చుట్టుముట్టి నా ప్రాణం తీయాలనుకుంటున్న శత్రువుల నుండి

మీ కనుపాపలా నన్ను కాపాడండి;

మీ రెక్కల నీడలో నన్ను దాచండి.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    6 నేను నీకు నివేదన చేశాను. ఎందుకంటే నువ్వు నాకు జవాబిస్తావు. దేవా, నేను నీతో మాట్లాడినప్పుడు నా మాట నీ చెవిన పడనివ్వు.

    7 శత్రువుల బారి నుంచి రక్షణ కోసం నీలో ఆశ్రయం పొందిన వాళ్ళను నీ కుడిచేతితో రక్షించేవాడా, నీ నిబంధన నమ్మకత్వాన్ని అద్భుతంగా నాకు కనపరుచు.

    8 నీ కంటి పాపను కాపాడినట్టు నన్ను కాపాడు. నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు.

    9 నా మీద దాడి చేసే దుర్మార్గులనుంచి, నన్ను చుట్టుముట్టిన నా శత్రువులనుంచి నన్ను కాపాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.