Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 19:1-8

1 ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి;

అంతరిక్షం ఆయన చేతిపనిని చాటుతుంది.

2 పగటికి పగలు బోధ చేస్తుంది;

రాత్రికి రాత్రి జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది.

3 వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు;

వాటి స్వరం వినబడదు.

4 అయినా వాటి స్వరం19:4 హెబ్రీలో కొలమానం భూమి అంతటికి,

వాటి మాటలు భూదిగంతాలకు వెళ్తాయి.

దేవుడు ఆకాశంలో సూర్యునికి డేరా వేశారు.

5 సూర్యుడు తన మంటపంలో నుండి బయటకు వస్తున్న పెండ్లికుమారునిలా,

తన పందెం పరుగెత్తడంలో ఆనందిస్తున్న వీరునిలా వస్తున్నాడు.

6 ఆకాశంలో ఒక చివర ఉదయించి

మరొక చివర వరకు దాని చుట్టూ తిరిగి వస్తాడు.

దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.

7 యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది,

అది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది.

యెహోవా కట్టడలు నమ్మదగినవి,

అవి సామాన్యులకు జ్ఞానాన్ని ఇస్తాయి.

8 యెహోవా కట్టడలు సరియైనవి,

హృదయానికి ఆనందం కలిగిస్తాయి.

యెహోవా ఆజ్ఞలు ప్రకాశవంతమైనవి,

కళ్లకు కాంతి కలిగిస్తాయి.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.