Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 3:1-6

OTSA Telugu Contemporary Version

1 యెహోవా, నాకు ఎంతోమంది శత్రువులు!

నామీదికి ఎంతోమంది లేస్తారు!

2 "దేవుడు అతన్ని విడిపించడు"

అని అనేకులు నా గురించి చెప్తున్నారు. సెలా3:2 సెలా హెబ్రీ భాషలో ఈ పదానికి స్పష్టమైన అర్థం లేదు. ఈ పదం కీర్తనలో తరచుగా వస్తుంది: ఇది సంగీతానికి సంబంధించిన పదం అయి ఉండవచ్చు. కీర్తన 3:4; కీర్తన 3:8 లో కూడా

3 కాని యెహోవా, మీరు నా చుట్టూ డాలుగా,

నాకు మహిమగా, నా తల పైకెత్తేవారిగా ఉన్నారు.

4 నేను యెహోవాకు మొరపెడతాను,

ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి జవాబిస్తారు. సెలా

5 నేను పడుకుని నిద్రపోతాను;

యెహోవా నన్ను సంరక్షిస్తారు కాబట్టి నేను మళ్ళీ మేల్కొంటాను.

6 అన్ని వైపుల నుండి

పదివేలమంది నాపై పడినా నేను భయపడను.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    1 యెహోవా, నాకు శత్రువులు ఎంతోమంది! చాలా మంది నా మీద దాడి చేశారు.

    2 దేవుని నుంచి అతనికి ఏ సహాయమూ లేదు అని ఎందరో నా గురించి అంటున్నారు. సెలా.

    3 కాని యెహోవా, నువ్వే నాకు డాలు, నువ్వే నాకు మహిమ, నా తల ఎత్తేవాడివి.

    4 నేను యెహోవాకు నా స్వరమెత్తినప్పుడు, ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబిస్తాడు. సెలా.

    5 నేను పడుకుని నిద్రపోయాను. యెహోవా నాకు క్షేమం ఇచ్చాడు గనక మేల్కొన్నాను.

    6 అన్ని వైపులనుంచి వచ్చి నాకు విరోధంగా మొహరించిన గుంపులకు నేను భయపడను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.